తాజా వార్తలు

మరో కొత్త చరిత్రను లిఖించిన టీవీ5

మరో కొత్త చరిత్రను లిఖించిన టీవీ5
X

అవార్డులు అందరూ ఇస్తారు. అయితే వాటిని అర్హులకు ఇస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అర్హులకు దక్కినప్పుడే ఏ పురస్కారానికైనా గౌరవం. ప్రతిభను గుర్తించి పట్టం కట్టడంలో ఎప్పుడూ ముందుండే టీవీ5 యాజమాన్యం ఈ విషయంలో మరో కొత్త చరిత్రను లిఖించింది. ట్రెండ్స్‌ను ఒడిసిపట్టి మార్కెట్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... వాణిజ్య రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారిని గుర్తించి బిజినెస్‌ లీడర్స్‌ అవార్డ్స్‌తో సత్కరించినా... స్టార్టప్‌లతో బుడిబుడి అడుగులు వేస్తోన్న అప్‌కమింగ్‌ ఆంత్రప్యూనర్స్‌ను ఎంకరేజ్‌ చేసినా, కాలేజీ విద్యార్థులను ఫ్యూచర్ లీడర్స్‌లా తీర్చిదిద్దే కాలేజ్ కనెక్ట్ చేపట్టినా... అది టీవీ5కి మాత్రమే సాధ్యం. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది టీవీ5.

ఆర్కిటెక్ట్స్‌ అండ్ ఇంటీరియర్‌ డిజైనర్సే ఎందుకు...? అంటే సమాధానం సింపుల్‌. కలల ప్రపంచానికి వాస్తవ రూపం ఇచ్చేది వీరే కాబట్టి. పెద్ద పెద్ద నిర్మాణాలు... అద్భుత కట్టడాలు చూసి అబ్బా అని ఆశ్చర్యపోయి మురిసిపోవడమే తప్ప వాటిని డిజైన్‌ చేసింది ఎవరు...? నిర్మాణం వెనుక ఉన్న కాన్సెప్ట్‌ ఏమిటి...? డిజైన్‌ చేయడానికి ఎంతకాలం పట్టింది...? డిజైన్‌ చేసే సమయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు...? ఇంటీరియర్‌ డిజైనింగ్ ఎవరు చేశారు...? మెటీరియల్స్ ఎక్కడ నుంచి కలెక్ట్‌ చేసారు...? అసలు ఇలా చేయాలన్నా ఆలోచన ఎలా వచ్చింది...? లాంటి విషయాల మీద చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే కంటికి కనిపించిన దాన్ని చూసి బాగుందని అనడమే తప్ప వాటిని రూపొందించిన వారి గురించి ఆలోచించరు. బహుశా ఈ కారణంతోనేమో మిగిలిన రంగాలలో వారికి వచ్చినంత పాపులార్టీ ఈ రెండు రంగాల్లో వారికి దక్కట్లేదు. ఇందులో తిరుగులేని పేరు ప్రఖ్యాతలని ఆర్జించిన వారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అలాగని వారికి ప్రతిభ లేక కాదు... సరైన సమయంలో దక్కాల్సిన గుర్తింపు రాక. అందుకే అలాంటి వారిని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చింది టీవీ5.

వజ్రాన్ని వెలికితీయడం కష్టం... కానీ ఒక్కసారి అది వజ్రమని తెలిసిన తర్వాత ఎంత చెక్కితే అన్ని ధగధగలు. అంత విలువ. మన దగ్గరా అలాంటి వజ్రాలకు కొదువలేదు. కావాల్సిందల్లా కాస్తంత సపోర్ట్‌. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆణిముత్యాలని వెలికితీసి వారి ప్రతిభకు మరిన్ని నగిషీలు అద్దడమే లక్ష్యంగా ముందుకొచ్చిన టీవీ5 సగర్వంగా సమర్పిస్తోంది ఆర్కిటెక్చర్‌ అండ్ ఇంటిరీయర్‌ డిజైనర్‌ అవార్డ్స్‌. ఈ తతంగమంతా పెద్ద ప్రహసనమైనప్పటికీ హైద్రాబాద్‌, అమరావతి, విశాఖపట్నం, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, తిరుపతి సహా వివిధ ప్రాంతాల్లో శోభాయమానంగా విరాజిల్లుతున్న నిర్మాణాలకు, అందుకు కారకులైన డిజైనర్లను గుర్తించి, విజేతలను గౌరవించడానికి రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏ ఛానల్‌కు రాని ఆలోచన ఇది అని మేం సగర్వంగా చెబుతున్నాం.

Next Story

RELATED STORIES