అరుదైన వ్యాధి కారణంగానే పెళ్లికి దూరంగా.. అల్లు అర్జున్ బ్యూటీ..

స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకట్టిన హీరోయిన్ కేథరిన్ ట్రెసా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి చిత్రాల్లో నటించిన కేథరిన్.. అనోస్మియా అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపింది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు వాసన చూడలేరని, మంచి వాసన అయినా, చెడు వాసన అయినా పసిగట్టలేరని తెలిపింది. లక్షమందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ అరుదైన జబ్బు గురించి ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని అంటోంది. చికిత్స తీసుకుంటున్నా ఫలితం కనబడట్లేదని తెలిపింది. తనుకున్న ఈ సమస్య కారణంగా పెళ్లికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నానని అంటోంది. కాగా, ప్రస్తుతం కేథరిన్ యూత్ ఫేవరెట్ స్టార్ విజయ్ దేవరకొండతో నటిస్తోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే చిత్రంలో విజయ్‌తో ఆడిపాడనుంది. అయితే తనకున్న వ్యాధి సినిమాలకు ఏమాత్రం అడ్డు కాదని కేథరిన్ చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com