బీఎస్పీ నాయకులకు చేదు అనుభవం.. గాడిదలపై ఊరేగించి..

X
బీఎస్పీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కార్యకర్తలు వినూత్నంగా బుద్ది చెప్పారు. ముఖానికి నలుపు రంగు పూసి గాడిదలపై ఊరేగించారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని ఘాటుగా హెచ్చరించారు.
జైపూర్లో బీఎస్పీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సీతారాం, పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్లపై ఆరోపణలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శలు వెల్లువెత్తాయి. దాంతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. సీతారాం, రాంజీ గౌతమ్ల ముఖానికి నల్ల రంగు పూశారు. వారి మెడలో బూట్ల దండ వేశారు. వారిద్దరినీ గాడిదలపై ఊరేగించారు. రాంజీ గౌతమ్, సీతారాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

