'బిగ్‌బాస్' హౌస్‌లో చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకు..

వంద రోజులు ఒకే ఇంట్లో.. అప్పటి వరకు ఒకరికి ఒకరు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకే ఇంట్లో అన్ని రోజులు కలిసి ఉంటే.. ఒకరి పరిచయం మరొకరికి సంతోషాన్ని ఇస్తుంది. వారి మధ్య ప్రేమలు సైతం చిగురిస్తాయి. హౌస్‌లో ఉన్నంత సేపు చూసే ప్రేక్షకులకు కూడా వారి మధ్య ఏదో జరుగుతోంది అని కథలు అల్లేస్తారు. అయితే అన్ని ప్రేమలు పెళ్లికి దారి తీస్తాయని చెప్పలేం. బయటకు వచ్చిన తరువాత ఎవరి జీవితాలు వారివి. కొందరు మాత్రం వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని కొనసాగిస్తుంటారు. అలా ర్యాపర్ స్టార్ చందన్ శెట్టి, నివేదితా గౌడలు కన్నడ బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల మైసూరు దసరా ఉత్సవాల వేదికపైన వివాహాన్ని ప్రకటించడం వివాదానికి దారితీసింది. దానికి చందన్, నివేదితలు క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం మైసూరులో వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహ తేదీని ప్రకటిస్తామని ఇరువురి కుటుంబసభ్యులు తెలియజేశారు. అభిమానుల సమక్షంలోనే వివాహ వేడుకలు జరుగుతాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com