చిదంబరానికి బెయిల్ మంజూరు.. అయినా జైలులోనే..

చిదంబరానికి బెయిల్ మంజూరు..  అయినా జైలులోనే..
X

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్.. ఈ సందర్బంగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ విచారణకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది.. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కుంటున్నారు. అక్టోబర్ 24వరకూ చిదంబరం ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది.. దీంతో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ ఈడీ కస్టడీ గడువు ముగిసేంతవరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.

Tags

Next Story