మరోసారి సత్తా చాటిన జస్టిన్‌ ట్రూడో

మరోసారి సత్తా చాటిన జస్టిన్‌ ట్రూడో

కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి సత్తా చాటారు. వరుసగా రెండోసారి అధికారం సాధించి రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 388 సీట్లకు గాను లిబరల్స్ పార్టీ 156 స్థానాలు దక్కించుకుంది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 122 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రవాస భారతీయుడు జగ్మీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ప్రగతిశీల అజెండాకు ప్రజలు పట్టం కట్టారని ట్రూడో పేర్కొన్నారు. ఆధునిక కెనడా ఆవిష్కరణకు ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు.

కెనెడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ 170. ప్రస్తుతం ట్రూడో పార్టీకి 156 స్థానాలున్నాయి. దాంతో న్యూ డెమోక్రటిక్ పార్టీ కీలకంగా మారింది. ఈ పార్టీకి 23 స్థానాలున్నాయి. ట్రూడో పార్టీ, న్యూ డెమోక్రటిక్ పార్టీలు చేతులు కలిపితే సీట్ల సంఖ్య 178కి పెరుగుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటు చాలా ఈజీ అవుతుంది. కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ట్రూడో ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సహా ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story