సర్కార్ కీలక నిర్ణయం.. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్

సర్కార్ కీలక నిర్ణయం.. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్
X

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. ఈ నిబంధన 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసోం జనాభా, మహిళా సాధికారికత విధానం పేరుతో ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. 2017లోనే ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించింది. అటు పేదలకు భూములు పంచాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సి ద్వారా పౌరులను గుర్తించినందున.. అసోంలో భూమి, ఇంటిస్థలం లేనివారికి కేటాయించాలని కేబినెట్ అమోదించింది.

Next Story

RELATED STORIES