నాకు స్వేచ్ఛగా ఎగరాలనుంది.. నా హృదయం తేలిపోతోంది..: రేణూ దేశాయ్

నాకు స్వేచ్ఛగా ఎగరాలనుంది.. నా హృదయం తేలిపోతోంది..: రేణూ దేశాయ్
X

అందం, అభినయంతో పాటు ప్రతిభా పాఠవాలు పుష్కలంగా ఉన్న ఓ మంచి వ్యక్తి రేణూ దేశాయ్. సినిమాలకు దూరంగా ఉన్నా బుల్లి తెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. తన కవితల ద్వారా తన హృదయంలో ఉప్పొంగుతున్న భావావేశాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తన విశేషాలను తెలుపుతూ పోస్టులు పెడుతుంటారు. మరాఠీ తన మాతృభాష అయినా హిందీలోనే కవితలు రాయడం ఇష్టమంటారు. కవితను హృద్యంగా కళ్లకు కట్టినట్టు అభివర్ణించటం ఆ భాషలోనే సాధ్యమవుతుందంటారు రేణు. తాజాగా వరుణుడిపై ఆమె రాసిన ఓ కవితను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అది ఇంగ్లీషులో ఉండడంతో రేణు కవితలను అనువదించే సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఈ కవితను కూడా ఆయనే తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. ఆ కవితను అభిమానులకోసం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పోస్ట్ చేశారు రేణూ. ఆ కవిత ఇలా సాగుతుంది..

నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా, విపాదరక్షగా

తన ఉనికిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటోంది

నన్ను నా రక్తంలో పరిమితం చేయకు

నా ప్రాణ వాహినిలా నాకు స్వేచ్చగా ప్రవహించాలనుంది

తెరలు తెరలుగా వచ్చి బలంగా తాకే వెచ్చటి గాలుల్లో

ఈకలా అలా అలా తేలిపోతోంది ఇప్పడు

నా హృదయం మెరుపు జాడని వెతుక్కుంటూ వెళ్లే

జల్లెడ లాంటి మేఘంలా ఉంది నన్ను ఆపకు

నా నెత్తుటిని ఉబకనివ్వు నేను పరవళ్లు తొక్కాలి

నేను పైపైకెగరాలి నేను కదలాలి నేను కురవాలి

విత్తనమై నేలమ్మ కడుపులో మళ్లీ మొలకెత్తాలి

మళ్లీ వికసించడానికి మళ్లీ విహరించడానికి.. ఇలా అందంగా ఆమె మనసులా సాగింది రేణూ దేశాయ్ కవితా ప్రవాహం.

Next Story

RELATED STORIES