ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి స్పెషల్.. 15,000 క్యాష్‌బ్యాక్

ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి స్పెషల్.. 15,000 క్యాష్‌బ్యాక్
X

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీపావళి సందర్భంగా తన ఖాతాదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఇందుకోసం ఎస్‌బీఐ వివిధ ట్రావెల్ కంపెనీలతో జతకట్టింది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు యాప్ ద్వారా ఆఫర్లు పొందవచ్చు. ఆఫర్ డిసెంబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ కస్టమర్లకు యోనో యాప్ లేకపోయినా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. మరి ఏఏ ట్రావెల్స్‌పై ఎంతెంత ఆఫర్లో ఒకసారి చూద్దాం..

clear trip offer: విమాన టికెట్లపై 20 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దేశీప్లైట్ బుకింగ్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే హోటల్ రిజర్వేషన్స్‌పై రూ.10,000 వరకు, ఇంటర్నేషనల్ ప్లైట్ బుకింగ్స్‌పై రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ease my trip offer: ఈ పోర్టల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే ప్లైట్ బుకింగ్స్‌పై రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ. 2,000 ఉండాలి. హోటల్ బుకింగ్స్‌పై రూ.700 వరకు, బస్ బుకింగ్స్‌పై 5 శాతం వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.

yatra offer:యాత్ర ప్లాట్‌పామ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే ఫ్లైట్ బుకింగ్స్‌పై రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. హోటల్ బుకింగ్స్‌పై 20 శాతం వరకు లేదంటే గరిష్టంగా రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు.

red bus offer: ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్ బస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే ట్రావెల్ యారి ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం లేదా రూ.120 వరకు తగ్గింపు లభిస్తుంది.

Next Story

RELATED STORIES