అంతర్జాతీయం

మరోసారి బరితెగించిన పాక్.. 400 మీటర్లు..

మరోసారి బరితెగించిన పాక్.. 400 మీటర్లు..
X

సరిహద్దుల్లో పాకిస్థాన్ ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నా పాక్ తీరు మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. బోర్డర్ వెంబడి బరితెగించి కాల్పులు జరుపుతోంది. పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడుతోంది. అదే సమయంలో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు దుస్సాహసం చేస్తోంది. నౌషారా సెక్టార్ లో ఉగ్రవాదుల చొరబాట్లకు అనుకూలంగా పాక్ సైన్యం 400 మీటర్లు చొచ్చు కొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు కాల్పులు జరిపారు. దీంతో పాక్ సైన్యం వెనుదిరిగింది. ఈ కాల్పుల్లో భారత్ ఆర్మీ అధికారి అమరుడయ్యారు.

అటు పూంచ్ సెక్టార్లో కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. విద్యా సంస్థలు టార్గెట్‌గా మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. పాక్ కాల్పుల్లో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. పాకిస్థాన్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ప్రజలకు నష్టం కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజ లను బంకర్లలోకి తరలించారు.

పీవోకేలో విదేశీ బృందం పర్యటిస్తున్నందున కాల్పులకు పాల్పడవద్దని కోరిన మరుసటి రోజే పాక్ కాల్పులకు తెగబడింది. అటు సరిహద్దులో సైనికుల బలగాలను భారీగా మోహరిస్తోంది. పీవోకే ఉగ్రశిబిరాలపై దాడి తర్వాత బలగాలను మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎల్వోసీలో కాల్పులకు పాల్పడుతూ ఆర్మీని డైవర్ట్ చేస్తున్న పాక్..పంజాబ్ సరిహద్దు వెంబడి డ్రోన్లతో ఆర్మీ కదలికలపై నిఘా పెడుతోంది. డ్రోన్లకు అత్యాధునిక కెమెరాలను అమర్చి చొరబాట్లకు అనువుగా ఉండే ప్రాంతాలను అన్వేషిస్తోంది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ , హుస్సేన్ వాలా సెక్టర్ లలో పెద్ద ఎత్తున సరిహద్దు బలగాలను మోహరించారు. నిరంతరం పెట్రోలింగ్ జరుపుతున్న బీఎస్ఎఫ్ బలగాలు ఇప్పటికి మూడు డ్రోన్లను కూల్చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES