పసిడి పరుగుకు బ్రేక్.. పది గ్రాముల ధర..

బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150లకు దిగొచ్చింది. దీంతో పది గ్రాముల ధర రూ.39,800కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150కు తగ్గి రూ.36,470కు వస్తుంది. బంగారం ధర ఇలా వుంటే వెండి మాత్రం పరుగులు పెడుతోంది. రూ.500లు పెరిగి కేజీ వెండి ధర 48,500కు చేరుకుంది.

ఢిల్లీ మార్కెట్లో పది గ్రాములున్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,450కు క్షీణించింది. 22క్యారెట్ల బంగారం ధర వచ్చి రూ.37,250కు చేరుకుంది. ఢిల్లీలో వెండి ధర కేజీ రూ.48,500లు పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు వ్యాపారస్తులు.

Tags

Read MoreRead Less
Next Story