లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి నిరాశ

లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో BJPకి నిరాశ తప్పలేదు. మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన బైపోల్‌లో NCP తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఉదయన్ రాజే భోస్లే NCP నుంచి విజయం సాధించారు. ఐతే.. అనూహ్యంగా ఆయన శరద్‌పవార్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. MPగా రాజీనామా చేశారు. దీంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పోలింగ్‌ను BJPతోపాటు NCP కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరికి సిట్టింగ్ స్థానాన్ని NCP నిలబెట్టుకుంది. ఏకంగా 51 శాతం ఓట్లు సాధించి పట్టు నిలుపుకుంది. BJP అభ్యర్థికి 43 శాతం ఓట్లు వస్తే ఇతరులకు 5 శాతానికి మించి ఓట్లు పడలేదు.
ఇక బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సఎభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని LJP నిలబెట్టుకుంది. రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ మరణంతో ఇక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. మిత్రపక్షాల మద్దతుతో LJP అభ్యర్థి విజయం సాధించారు. ఆ పార్టీకి 49 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 36 శాతం ఓట్లు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com