డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం

డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం

ts-highcourt

రాష్ట్రంలో విజృంభించిన డెంగీ జ్వరాల నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. జనం చనిపోతున్నా స్పందించట్లేదంటూ బుధవారం అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను ఆదేశించింది. గురువారం విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వైద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

డెంగీ నివారణకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అభిప్రాయపడింది హైకోర్టు. అధికారులు తీసుకున్నచర్యలు కేవలం కాగితాలపై మాత్రమే కనబడుతున్నాయంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగోలేదనీ.. డెంగీని నివారించలేకపోతే మృతుల కుటుంబాలకు 50లక్షలు పరిహారంగా చెల్లించాలని వ్యాఖ్యానించింది. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులదేనని స్పష్టంచేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగుంటే ప్రజలు కోర్టులకు ఎందుకు వస్తారని ప్రశ్నించింది. మూసీ నదిని ఉత్నతాధికారులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. జనవరిలో 85 కేసులు ఉంటే అక్టోబర్ నాటికి

3 వేల 800 కేసులకు ఎలా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నగరంలో 427 చోట్ల దోమల బెడద అధికంగా ఉందని అధికారులు తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని కోర్టుకు వివరించారు.

IASల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్టు లేదని.. సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. డెంగీ నివారణ చర్యలు తీసుకోవాలని పదే పదే కోరినా అధికారుల్లో చలనం లేదంటూ అగ్రహం వ్యక్తం చేసింది..ఎంతో ఖర్చుచేసి IASలుగా తీర్చిదిద్దుతున్నది ఇందుకోసమేనా అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం.

Tags

Read MoreRead Less
Next Story