ఫిఫ్టీ ఫిఫ్టీ.. టేస్టీ టేస్టీ.. మరాఠా గడ్డపై లేటెస్ట్‌ స్లోగన్!

ఫిఫ్టీ ఫిఫ్టీ.. టేస్టీ టేస్టీ.. మరాఠా గడ్డపై లేటెస్ట్‌ స్లోగన్!

maharastra

ఫిఫ్టీ ఫిఫ్టీ.. టేస్టీ టేస్టీ.. మరాఠా గడ్డపై లేటెస్ట్‌గా వినిపిస్తున్న స్లోగన్ ఇదే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వానికి శివసేన చేసిన ఆఫర్ ఇదే. అధికారాన్ని పంచుకోవడమే కాదు, ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పంచుకుందామని శివసేన నాయకులు సూచిస్తున్నారు. రెండున్నరేళ్లు మీరు, మిగ తా రెండున్నరేళ్లు మాకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి సీటును షేర్ చేసుకోవడం తప్పేమీ కాదని, ప్రస్తుత పరిణామాల నేపథ్యం లో అదే మంచి పద్ధతి అని కూడా వాదిస్తున్నారు. ఐతే, శివసేన డిమాండ్‌పై బీజేపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

మహారాష్ట్రలో బీజేపీ సంఖ్యాబలం గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 122సీట్లు వచ్చాయి. తాజా ఎలక్షన్లలో కమల దళానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బలం 122 నుంచి వందకు పడిపోయింది. శివసేన పార్టీ బలం కూడా కొద్దిగా తగ్గింది. ఐతే, బీజేపీతో పోలిస్తే శివసేన పార్టీ బలంలో తగ్గుదల తక్కువగా ఉంది. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన శివసేనకు 63 సీట్లు వచ్చాయి. తాజా ఎలక్షన్లలో శివసేన పార్టీ 57 సీట్లు మాత్రమే సా ధించింది. ఈ నేపథ్యంలో సీఎం కుర్చీని పంచుకోవాలని శివసేన ప్రతిపాదిస్తోంది. ఇది ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదన కాదని, గతంలోనే తాము ఈ మాట బీజేపీ నాయకత్వానికి చెప్పామని శివసేన నాయకులు అంటున్నారు.

ఠాక్రే వంశాకురం ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలన్నది శివసేన వ్యూహం. ఎన్నికల ముందు నుంచే ఈ దిశగా అడుగులు వేసింది. ఆదిత్య తండ్రి ఉద్ధవ్ ఠాక్రే తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కూడా సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐతే, మొదటి రెండున్నరేళ్లు డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకుంటామని, మిగతా రెండున్నరేళ్లు మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని శివసేన డిమాండ్ చేస్తోంది.

ఠాక్రే వంశం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై వర్లి స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించా రు. దాంతో ఆదిత్యను సీఎం చేసే దిశగా శివసేన అడుగులు వేస్తోంది. మరి, ఈ ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మహారాష్ట్రలో ఇంతవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ పార్టీ పంచుకోలేదు. ఇప్పుడు బీజేపీ-శివసేన పార్టీలు సీఎం సీటు పంచుకుంటే అది కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది.

Tags

Read MoreRead Less
Next Story