తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట..

తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట..
X

తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. 2019 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఏపీకి 14, తెలంగాణకు 9 జాతీయ పంచాయతీ పురస్కారాలు వరించాయి. ఈ అవార్డులను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ఉన్నధికారులు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

గ్రామ పంచాయతీ వికాస్ యోజన అవార్డును ఏపీలోని చిత్తూరు జిల్లా కరకంబాడికి దక్కించుకుంది. బాల్య మిత్ర పంచాయతీ పురస్కారం నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం గ్రామానికి వరించింది. తెలంగాణ నుంచి జగిత్యాల జిల్లాలోని పైడిమడుగు విలేజ్ సొంతం చేసుకుంది. అటు నానాజీ దేవ్‌ ముఖ్ జాతీయ గౌరవ గ్రామ పుస్కారాన్ని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం పంచాయతీకి వరించింది. తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్‌ గ్రామానికి పురస్కారం ఇచ్చారు.

Next Story

RELATED STORIES