తాజా వార్తలు

మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు..

మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు..
X

తెలంగాణలో వాన బీభత్సం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. రెండు గంటలపాటు కురిసిన వానకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. సూర్యాపేట, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.. కరీంనగర్ జిల్లాతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.. మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని దక్షిణ కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇవి తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

Next Story

RELATED STORIES