కాంగ్రెస్ పుంజుకోవడం బీజేపీకి ఆందోళన కలిగిస్తుందా?

మహారాష్ట్రలో జేజేపీ-శివసేన కూటమి విజయం సాధించింది. కానీ, ఈ విజయం ఆస్వాదించే స్థాయిలో బీజేపీ లేదు. కారణం. గతంలో కన్నా ఈ సారి సీట్లు తగ్గటమే. బంపర్ మెజారిటీతో గెలుస్తామని ఆశపడిన కూటమి పార్టీలకు బంగపాటు తప్పలేదు. హర్యానాలో అయితే..బీజేపీ మేజిక్ ఫిగర్ కూడా చేరుకోలేదు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు అమలు చేయనిది.. 70 రోజుల్లో తాము సాధించామని ఆర్టికల్ 370 పై ప్రచారం చేసుకుంది బీజేపీ. మహారాష్ట్ర ప్రచారంలో ఎక్కువగా ఆర్టికల్ 370 గురించే వివరించారు ప్రధాని. కానీ, తన వాదనలు పెద్ద ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. గతంలో కంటే బీజేపీ-శివసేన కాస్త ఆలస్యమైన ఫర్వాలేదు. బీజేపీ ఎంతసేపు జాతీయ ఆంశాలపై ప్రసంగించిన బీజేపీ నేతలు స్థానిక అంశాలపై దృష్టి పెట్టని కారణంగానే ఎదురుదెబ్బ తిన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రలో మోదీ, ఆమిత్ షా ప్రచారం చేశారు. ప్రచారం షెడ్యూల్ ని పెంచుకున్నారు. అయితే.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ వంటి అగ్రనేతల ప్రచారం ఆశించిన స్థాయిలో లేనప్పటికీ కాంగ్రెస్ పుంజుకోవడం బీజేపీ ఆందోళన కలిగించే అంశమే.

హర్యానాలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. బోర్డర్ లో సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370, రైతులకు గిట్టుబాటు ధర పెంచిన ప్రభుత్వం తమదేనని ఘనంగానే చాటుకుంది బీజేపీ. కానీ, హర్యానాలో జాతీయ అంశాలను పెద్దగా పట్టించుకోలేదు ఓటర్లు. అంతా లోకల్ సమస్యలకే ప్రధాన్యం ఇచ్చారు. దీంతో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి గతంలో కంటే 7 స్థానాలను కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story