కొత్త మలుపు తిరిగిన ఆర్టీసీ సమ్మె

కొత్త మలుపు తిరిగిన ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మె కొత్త మలుపులు తిరుగుతోంది.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, సమ్మె ఉధృతానికి ప్రణాళికలు రచిస్తున్న కార్మికల సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది.. ఆర్టీసీ కార్మికుల్లో విలీనం అనే విషాన్ని నింపింది అశ్వత్థామరెడ్డేనంటూ ఆర్టీసీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

సమ్మె పొడిగింపు వల్ల తమకు నష్టం జరుగుతోందంటూ కూకట్‌పల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు. ముఖ్యమంత్రి మీడియా సమావేశం ద్వారా కార్మికులకు మంచి అవకాశం ఇచ్చారని.. కానీ, అశ్వత్థామరెడ్డి తమలో విలీనమే విషాన్ని నింపారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. ఆలోచించాలని కార్మికులకు సూచించాడు. యూనియన్‌ లీడర్లు వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడాలని.. సమ్మె విరమణ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరాడు. తాను మాత్రం విధులకు హాజరవుతానని చెప్పాడు. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని డ్రైవర్‌ రాజు చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story