పెళ్లికి నో చెప్పాడని ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి

పెళ్లికి నో చెప్పాడని ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి
X

up

'నువ్వేనాప్రాణం', 'నీతోనే నా జీవితం', 'నువ్వులేక నేను లేను', 'నిన్నేపెళ్లాడతా'.. అంటూ ఓ నాలుగైదు సినిమా పేర్లు చెప్పి యువతిని ముగ్గులోకి దింపాడు ఓ యువకుడు. ఇంకేముంది ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని సిటీ మొత్తం తిరిగారు. నా పెళ్లి అంటూ జరిగితే అది నీతోనే అని మాయ మాటలు చెప్పాడు. పాపం అతని మాటలగారిడీ నమ్మి ఆ యువతి మోసపోయింది. కొన్ని రోజుల తరువాత ప్రియుడి ప్రవర్తనలో మార్పు గమనించింది యువతి. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని అడిగింది. దీంతో అతడు నెల రోజులుగా ఆమెతో మాట్లాడకుండా దూరం పెట్టాడు. యువతి ఫోన్ చేస్తున్నా అతను స్పందించలేదు. కోపంతో రగిలిపోయిన యువతి ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది. పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

అలీఘర్‌లోని జీవన్‌ఘర్ ప్రాంతానికి చెందిన యువతి స్థానికంగా ఉండే ఫైజాద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని.. కొన్ని రోజులు లవ్‌ని ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పడంతో.. ఆమె నమ్మి మోసపోయింది. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోమని ప్రియుడ్ని అడిగింది. అంతే అతడు నెల రోజులుగా ఆమెతో మాట్లాడకుండా దూరం పెట్టాడు. యువతి ఫోన్ చేస్తున్నా ఫైజాద్ స్పందించలేదు. దీంతో అతడిపై ఆమె పగ పెంచుకుంది. ఎలాగైనా సరై అతని మీద పగ తీర్చుకోవాలని భావించింది. కొన్ని రోజులు అతడి ఇంటి సమీపంలో నిఘా పెట్టింది. ఫైజాద్ ఇంట్లో నుంచి బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తీసి అతడిపై పోసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES