మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు వీడని ఉత్కంఠ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు వీడని ఉత్కంఠ
X

maharstra

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఉత్కంఠత వీడడం లేదు.. బీజేపీ-శివసేన కూటమికి మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే అధికంగానే సీట్లు వచ్చినా.. సీఎం విషయంలో చిక్కు ముడి కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం పదవి కోసం శివసేన పట్టు పట్టడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఇటు బీజేపీ కాని, అటు శివసేన కాని అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు.

ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాత్రోశ్రీలో ఎమ్మెల్యేలు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 50-50 ఫార్ములాను అనుసరించాల్సిందేనని శివసేన నేతలు పట్టుబడుతున్నారు. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాల్సిందేనని శివసేన పట్టుదలతో ఉంది. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది.

288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 161 సీట్లను బీజేపీ కూటమి గెలిచింది. బీజేపీ 105 స్థానాలు గెలుచుకోగా, శివసేన 56 చోట్ల విజయం సాధించింది. అయితే బీజేపీ సీట్లు తగ్గడం వంటి కారణాలతో ప్రభుత్వంలో పట్టు కోసం శివసేన తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీఎం పదవిని రెండున్నరేళ్లపాటు కూటమిలోని రెండు పార్టీలు చేపట్టాలని శివసేన పట్టుబడుతోంది. అయితే దీనిపై ఇంకా బీజేపీ హైకమాండ్‌ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

శివసేన డిమాండ్‌కు ఎన్సీపీ కూడా మద్దతు ఇస్తోంది. శివసేన చేస్తున్న డిమాండ్లలో తప్పేమిలేదని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తెలిపారు. 1990లో కూడా బీజేపీ, శివసేన పార్టీలు ఇదే ఫార్ములా అనుసరించాయనీ.. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వారికి తెలుసునని ఆయన గుర్తుచేశారు.

Next Story

RELATED STORIES