డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంపై కేటీఆర్‌ సమీక్ష

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంపై కేటీఆర్‌ సమీక్ష

ktr

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంపై హౌసింగ్ శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని యాదవ్‌లు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం పైన ప్రధానంగా ఈ సమావేశం చర్చించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా GHMC పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రులకు చెప్పారు అధికారులు.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు చాలా చోట్ల 70 శాతానికిపైగా పూర్తయ్యాయని, మిగిలినచోట్ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాలు దాదాపు పూర్తయ్యేందుకు వచ్చిన ప్రాజెక్టు సైట్ల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని, ఆయా ప్రాంతాలకు అవసరం అయిన తాగునీరు, ఇతర సౌకర్యాలు వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ నగరంలో మురికివాడల్లో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఆ ప్రాంతాల కోసం స్థలాలు ఇచ్చిన పేదలకు అప్పగించాలని కోరారు. దీంతోపాటు హైదరాబాద్ నగర పరిధిలోని JNNURM, వాంబే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినందున వాటి లబ్ధిదారుల ఎంపికను నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story