ఎన్‌పీఎస్‌లో ప్రతి నెలా రూ.2000లు ఆదా చేస్తే.. రూ.50 లక్షలు..

ఎన్‌పీఎస్‌లో ప్రతి నెలా రూ.2000లు ఆదా చేస్తే.. రూ.50 లక్షలు..

money2004 లేదా ఆపైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు ఎన్‌పీఎస్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎన్‌పీఎస్ అకౌంట్‌కు సమాన కంట్రిబ్యూషన్ ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు ఉద్యోగి ఎన్‌పీఎస్ అకౌంట్‌కు ప్రతి నెలా రూ.2,000 కంట్రిబ్యూట్ చేస్తే.. అప్పుడు ప్రభుత్వం కూడా ఉద్యోగి వేతనానికి రూ.2,000 కంట్రిబ్యూట్ చేస్తుంది. ఉద్యోగి 30 ఏళ్ల వయసు నుంచి ఎన్‌పీఎస్ అకౌంట్‌కు ప్రతి నెలా 2వేలు జమ చేస్తూ వస్తే రిటైర్మెంట్ సమయానికి ఈ మొత్తం రూ.50 లక్షలు అవుతుందని ఎన్ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మందాకర్ కర్లేకర్ వివరించారు. ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్, ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్ అనే మూడు ఫండ్ మేనేజర్లను నియమించిందని ఆయన పేర్కొన్నారు.

Read MoreRead Less
Next Story