మత్తు దిగిందా.. మద్యం బాటిల్ 14 కోట్లంట!

మత్తు దిగిందా.. మద్యం బాటిల్ 14 కోట్లంట!

whisky

మసక చీకట్లో మందు బాటిల్ కొని ఓ పెగ్గు వేస్తేకానీ నిద్ర పట్టదు. ఇంటావిడ రోజూ తిట్ల దండకం మొదలు పెట్టినా మద్యం ఇచ్చిన కిక్కుతో అవేవీ చెవికి ఎక్కవు. మాయదారి తాగుడికి బానిసై పెళ్లాం పిల్లలని పట్టించుకోకుండా డబ్బులు అన్నీ తగలేస్తున్నారన్నా చీమ కుట్టినట్టు ఉండదు. మజా చేయడానికి మరికొందరిని వెంటేసుకుని వెళితే జేబుకి చిల్లే. మద్యం తాగితే మనీ మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతాయా అంటే నిజమేనేమో అనిపించక మానదు. మంచి బ్రాండ్ అయితే వేలల్లో ఉంటుంది. మరి కాస్త డబ్బులు పెట్టే స్థోమత ఉంటే లక్షలు పెట్టి కూడా విస్కీ బాటిల్ కొనేస్తున్నారు మందు బాబులు.. మనీ మస్తుగ ఉన్న మహరాజులు. అయితే ఓ మద్యం బాటిల్ ఖరీదు వేలు లక్షలూ కాదండోయ్ కోట్లు.. కోట్లు పెట్టి కూడా కొనేస్తున్నారంట.

చిత్రం కాకపోతే నాలుక్కి ఎన్ని రుచులు కావాలో.. కోట్లు పెట్టి కోటలాంటి ఇల్లు కట్టించుకున్నారంటే అర్థం ఉంది. తర తరాలు చెప్పుకుంటారు. కానీ బ్రాండ్ ఉన్న బాటిల్‌కి.. ఆఫ్ట్రాల్ ఒక్క నిమిషం ఆనందానికి అంత ఖర్చు పెట్టాలా అంటే.. అవును మరి అది అరవై ఏళ్ల నాటి 'మేక్లాన్ బ్రాండ్' విస్కీ. దాని కోసం ఏకంగా వేలం పాటే నిర్వహించారు నిర్వాహకులు.. 1.5 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.13.61 కోట్లు) వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అరుదైన బ్రాండ్‌లు 40 మాత్రమే ఉండడంతో రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రస్తుతం ఈ ఖరీదైన కాక్‌టెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, గత ఏడాది 1.2 మిలియన్ పౌండ్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఆ రికార్డుని మేక్లాన్ బద్దలు కొట్టింది.

Read MoreRead Less
Next Story