హర్యానాలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం

హర్యానాలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం
X

haryana-cm

హర్యానాలో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. మనోహార్‌లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సత్యదేవ్ నారయణ్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.

హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలకు గాను... ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 సీట్లు గెలిచాయి. ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేజేపీ మద్దతతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేజేపీకి డిప్యూటీ సీఎం పదవితోపాటు.. మంత్రివర్గంలోనూ చోట్లు కల్పించేందుకు బీజీపీ హామీ ఇచ్చింది.

జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరిగిందని బీజేపీ చెబుతోంది. మొదట దీపావళి తర్వాతే ప్రమాణస్వీకారం చేయాలని భావించినప్పటికీ మంచిరోజు కావడం.. పైగా దీపావళి కూడా కలిసిరావడంతో ఆదివారం సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్ణ విస్తరణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES