బాలుడు క్షేమంగా బయటకి రావాలి: రజనీకాంత్‌

బాలుడు క్షేమంగా బయటకి రావాలి: రజనీకాంత్‌
X

rajani

తమిళనాడులో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మూడోరోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వి.. బాలుడుని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుజీత్‌ విల్సన్‌ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ పాత బోరుబావిలో పడిపోయాడు. సుజీత్ 36 అడుగుల లోతు నుంచి 90 అడుగుల లోతులోకి పడిపోయాడు. దీంతో బాలుడిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

సుజిత్‌ను కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు హీరో రజనీకాంత్‌ అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాలుడిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Next Story

RELATED STORIES