అడ్వంచరస్ సీఎం

అడ్వంచర్ ఫీట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రత్యేకంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పోత్రహిచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఘాట్‌ రోడ్డులో బైక్‌ పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఆయన.. ఇప్పుడు మరో సాహసం చేశారు. 15 వేల 600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు.

ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో చైనా బోర్డర్‌కు అత్యంత దగ్గరగా వుండే తవాంగ్ జిల్లాలో ptso లేక్ నుంచి మాంగో ఏరియా వరకు ఏటీవీని 107 కిలోమీటర్ల దూరం సీఎం పెమా ఖండూ నడుపుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సాహసోపేతమైన ఈ రైడ్ తర్వాత సరిహద్దులోని జవాన్లతో పెమా ఖండూ, కిరణ్ రిజిజు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ యాత్రలో పెమా ఖండూతోపాటు పాల్గొన్న కేంద్ర మంత్రి రిజిజు అయితే.. ఖండూ సాహసాన్ని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి ఎన్నో అడ్వంచర్స్ చేశారు సీఎం పెమా ఖండు.

Tags

Read MoreRead Less
Next Story