మహిళలకు ఢిల్లీ సీఎం దివాళీ గిఫ్ట్.. ఇక నుంచి బస్సుల్లో ఫ్రీ..

మహిళలకు ఢిల్లీ సీఎం దివాళీ గిఫ్ట్..  ఇక నుంచి బస్సుల్లో ఫ్రీ..

cm-kejrival

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ వాసులకు దగ్గరయ్యేందుకు పలు ప్రకటనలు చేస్తున్న సీఎం... తాజాగా బస్సుల్లో భద్రతపై దృష్టిసారించారు. సుమారు 13వేల మంది మార్షల్స్ ను నియమించారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

గతంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించిన సీఎం... దీనిని అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. దివాళీ గిఫ్టుగా మహిళలు ఇక నుంచి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంతకుముందు మెట్రో రైళ్లలో కూడా మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అయితే సుప్రీంకోర్టు తప్పబట్టడంతో అమలు చేయలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలోనే ఉచిత ప్రయాణం, మార్షల్స్ నియామకం చేపట్టినట్టు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story