Top

హాలీవుడ్ స్టార్లను బెంబేలెత్తిస్తోన్న కార్చిచ్చు

హాలీవుడ్ స్టార్లను బెంబేలెత్తిస్తోన్న కార్చిచ్చు
X

California-forest-fires

కాలిఫోర్నియా కార్చిచ్చు మరింత విజృంభిస్తోంది. కొండలు కోనలు దాటుకొని పట్టణాలు, గ్రామాలపై దాడి చేస్తోంది. అడవులను మింగేస్తున్న దావానలం, ఇప్పుడు ఇళ్లను కబళిస్తోంది. హాలీవుడ్ స్టార్లను కూడా ఈ దావాగ్ని బెంబేలెత్తి స్తోంది. అగ్నికీలల ధాటికి సూపర్ హీరోలు కూడా వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి

కాలిఫోర్నియా కార్చిచ్చు సెగలు లాస్ ఏంజిల్స్‌ను తాకాయి.

హాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బెంట్‌ వుడ్‌ సహా శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. బాస్కె ట్ బాల్ సూపర్ స్టార్ లిబ్రోన్ జేమ్స్, హాలీవుడ్ ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, మీడియా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇక్కడే ఉంటున్నారు. అంతా నిద్రలో ఉన్న సమయంలో మంటలు అంటుకున్నాయి. ముందుగా తెల్ల వారుజామున లిబ్రోన్ జేమ్స్ ఇంటికి నిప్పు అంటుకుంది. దాంతో ఆయన తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి పరుగులు తీశారు. జేమ్స్ ఇంటిని ముట్ట డించిన అగ్నిజ్వాలలు ఆ తర్వాత ఇతర ఇళ్లకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో సెలబ్రిటీలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ప్రముఖ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగర్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రాణభ యంతో వణికిపోయారు.

కార్చిచ్చు దెబ్బకు బ్రెంట్ వుడ్ ప్రాంతంలో దట్టమైన పొగ, బూడిద కమ్ముకుంది. అనేక విల్లాలు కాలిబూడిదయ్యా యి. సుమారు 50 లక్షల డాలర్ల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది. దావాగ్ని కారణంగా ఆర్నాల్డ్ కొత్త సినిమా టర్మినేటర్ డార్క్‌ ఫేట్ ప్రీమియర్ షోను రద్దు చేశారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. హెలికాప్టర్లు, విమాన ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Next Story

RELATED STORIES