తల్లిని హత్య చేసిన కూతురు కేసులో కీలక మలుపు

తల్లిని హత్య చేసిన కూతురు కేసులో కీలక మలుపు
X

rajitha-murder-case

అత్యంత కిరాతకంగా తల్లినే హత్య చేసిన హయత్ నగర్ ఘటనలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. రజితను కీర్తి చంపేలా ప్రోత్సహించింది ఆమె ప్రియుడు శశి అని పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసింది. తమ ప్రేమకు అడ్డుగా ఉందని.. ఆమెను చంపితే పెళ్లి చేసుకోవచ్చని కీర్తిని ప్రియుడు శశి రెచ్చగొట్టినట్టు తెలిసింది. ఇరువురు పథకం ప్రకారమే రజితను చంపినట్టు విచారణలో తేలింది.

శ్రీనివాస్ రెడ్డి, రజితలకు ఒక్కగానొక్క కూతురు కీర్తి కావడంతో ఆమె ఆస్తిపై కన్నేశాడు శశి. కీర్తిని పెళ్లి చేసుకుంటే వారి ఆస్తి దక్కుతుందని భావించాడు. అయితే రజిత వీరి ప్రేమ వ్యవహారం తెలిసి... మందలించింది. పలుమార్లు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో రజితపై కక్ష పెంచుకున్న శశి.. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఆమె బతికుండగా ఆస్తి పెళ్లి చేసుకోవడం కుదరదని నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగానే కీర్తిని రెచ్చగొట్టి తల్లిని చంపేలా ప్లానేశాడు. పథకం ప్రకారం కీర్తిని రెచ్చగొట్టాడు. మీ అమ్మ ఉండగా మన పెళ్లి జరగదని... ఆమెను చంపేద్దామని సలహా ఇచ్చాడు. కీర్తి కూడా శశి మయాలో పడింది. చివరకు ఇద్దరు కలిసి రజితన హతమార్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న శశి.. తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. కీర్తి కూడా తన ప్రియుడు శశి చెప్పడం వల్లే తల్లిని చంపినట్టు అంగీకరించింది.

Next Story

RELATED STORIES