తాజా వార్తలు

మరో ఆర్టీసీ కార్మికురాలు మృతి

మరో ఆర్టీసీ కార్మికురాలు మృతి
X

ts-rtc

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురై మరో మహిళా కండక్టర్‌ హఠాన్మరణం చెందింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌ గ్రామంలో జరిగింది. హుస్నాబాద్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల లతా మహేశ్వరి ఇంట్లో టీవీ చూస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందింది.

సమ్మె కారణంగా జీతం రాక ఆర్థిక ఇబ్బందుల వల్లే లత మనస్తాపానికి గురైందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఉద్యోగం పోతుందని తీవ్ర ఆవేదనకు గురైనట్టు ఫ్యామిలీ మెంబర్స్‌ తెలిపారు. భార్య ఆకస్మిక మరణంతో ఇద్దరు పిల్లలు, భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story

RELATED STORIES