ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ts-highcourt

ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఇటు కార్మికులపై, అటు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మెపై విచారణ సందర్భంగా ఇరు పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె విరిమించాలని కార్మికులను ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే సకలజనల సమరభేరి సభకు అనుమతిచ్చింది. ముందు చెప్పిన ప్రకారమే సరూర్‌ నగర్‌ స్టేడియంలో సభ నిర్వహించుకోనేందుకు ఆమోదం తెలిపింది.

మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారంలోగా బకాయిలపై పూర్తి నివేదిక ఇవ్వవాలని ఆదేశించింది. అలాగే వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీని కూడా తీసుకురావాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story