ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌ కేసు విచారణ

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌ కేసు విచారణ

నల్గొండ జిల్లా హజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌ కేసు విచారణ ముమ్మరమైంది. ప్రస్తుతం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ముగ్గురు మైనర్ బాలికల హత్యాచారం కేసు నిందితుడు శ్రీనివాస రెడ్డిని బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారణకు ఐదుగురు సాక్షులు సహా.. బాధిత శ్రావణి తల్లిదండ్రులు సైతం హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా శ్రావణి తండ్రి తీవ్ర ఉద్వేగానికి గురై.. సొమ్మసిల్లిపోయారు. హజీపూర్ బాలికల కేసు విచారణ జరుగుతోన్న తీరుని స్వయంగా పరిశీలించారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.

భువనగిరి పోలీసులు కేసు విచారణలో భాగంగా.. మృతులైన శ్రావణి, కల్పన, మనీషాలకు చెందిన డి.ఎన్.ఏ, ఫోరెన్సిక్ రిపోర్టులను స్పెషల్ కోర్టుకు సమర్పించారు. చార్జిషీట్‌లో దాదాపు 300 మంది సాక్ష్యులను విచారించినట్లు స్పష్టంచేశారు. అత్యాచారం, హత్యకు గురైన బాధితుల కుటుంబ సభ్యులు, సాక్షుల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేసింది. వచ్చే నెలాఖరు వరకూ హజీపూర్ వరుస హత్య కేసుల ఘటనపై విచారణ జరగనున్నట్లు సమాచారం. మొదట హత్య 2015 ఏఫ్రిల్ నెలలో చేయగా.. రెండోది మార్చి-2019, ఏఫ్రిల్-2019లలో మూడో హత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో నిందతుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు.

ముగ్గురు మైనర్ బాలికల హత్యాచారం కేసులో.. టెక్నికల్ ఆధారాలతోపాటు.. DNA, పోరెన్సిక్ రిపోర్ట్ లను సైతం పోలీసులు సంపాదించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కఠినమైన శిక్ష పడేలా.. అన్ని కోణాల్లోనూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలతో భువనగిరి పోలీసులు విచారణ చేపట్టారు. మృతిచెందిన శ్రావణి, కల్పన, మనీషాలకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేధికలను సైతం కోర్టుకు సమర్పించారు. ఇవేగాక.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లో ఉన్న మేసేజ్‌లు, వీడయోలను సైతం సేకరించి, భద్రపర్చి.. కోర్టుకు అందజేశారు పోలీసులు. మరో నాలుగు వారాల్లోనే.. హజీపూర్ ముగ్గురు మైనర్ బాలికల హత్యాచారం కేసులో తుది తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story