మైనర్‌పై అత్యాచారం.. ఆపై వ్యభిచారం

మైనర్‌పై అత్యాచారం.. ఆపై వ్యభిచారం
X

minor-girl

డబ్బు కోసం కూతురులా చూసుకోవాల్సిన అమ్మాయిని చెరిచి మరీ వ్యభిచార రొంపిలోకి దింపారు దంపతులు. పదహారేళ్ల మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించి డబ్బు సంపాదిస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలోని కంచరపాలెం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కంచరపాలెం పరిధిలోని కప్పరాడ సమీపంలోని కస్తూరి నగర్ కు చెందిన మైనర్ బాలిక కొన్నాళ్లుగా తన పిన్ని వాళ్లింట్లో ఉంటోంది. ఇంటి సమీపంలో ఉండే పప్పీ రాణి, చందు దంపతులతో ఆ అమ్మాయికి చనువు పెరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కయ్యపాలేనాకి చెందిన నానితోనూ పరిచయం ఏర్పడింది. మాయమాటలతో అరకు తీసుకెళ్లి బాలికను ఆత్యాచారానికి ఒడిగట్టాడు నాని. దీన్ని సాకుగా చూపించి బాలికను బెదిరించి రాణి, చందు కొన్నాళ్లుగా ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే.. మైనర్ బాలికకు గర్భం రావటంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. అబార్షన్ కోసం కేజీహెచ్ కు తీసుకెళ్లగా మైనర్ కావటంతో డాక్టర్లు టెస్ట్ రిపోర్ట్ లను పోలీసులకు అందించారు. దీంతో ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులు విషయం తెల్సుకొని రాణి, చందు దంపతులతో పాటు నానిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాని పోలీసుల అదుపులో ఉండగా.. రాణి, చందు దంపతులు పరారీలో ఉన్నారు.

Next Story

RELATED STORIES