వ్యాపారవేత్తతో రాసలీలల దృశ్యాలను భర్తతో రికార్డ్ చేయించిన భార్య

వ్యాపారవేత్తతో రాసలీలల దృశ్యాలను భర్తతో రికార్డ్ చేయించిన భార్య
X

hyd-honey

హైదరాబాద్‌లో ఓ ఎయిర్‌హోస్టస్ బడాబాబులకు వల వేసి పక్కాగా ట్రాప్ చేస్తోంది. భర్తతో కలిసే గేమ్‌ ఆడుతూ లక్షలకు లక్షలు గుంజుతోంది. ఎట్టకేలకు పాపం పండి ఇప్పుడు ఊచల్లెక్కెడుతోంది. ఎయిర్‌హోస్టర్‌గా పనిచేస్తున్న కనిష్క.. ఇటీవల ఓ వ్యాపారవేత్తను ముగ్గులోకి దించింది. అతనితో గడిపిన దృశ్యాల్ని భర్తతో రహస్యంగా షూట్ చేయించింది. తర్వాత అవి చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

శంషాబాద్ దగ్గర్లోని మొయినాబాద్ రిసార్టుకు పిలిపించి అతన్ని బెదిరించింది. కనిష్క దంపతులు తలకు తుపాకీ గురిపెట్టి వార్నింగ్ ఇవ్వడంతో.. భయపడి వాళ్లు అడిగిన కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇందుకు బాండ్ కూడా రాశాడు. ఇప్పటికే రూ.20 లక్షలు అతన్నుంచి రాబట్టారు కనిష్క, విజయ్ కుమార్. మళ్లీ మళ్లీ డబ్బు డిమాండ్ చేస్తుండడంతో చివరికి ఆ బిజినెస్ మ్యాన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు ఛేదించేందుకు పక్కాగా వల పన్నిన పోలీసులు కనిష్కను పట్టుకునేలోపు ఆమె మరో NRIని ట్రాప్ చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా మోసం చేయకముందే ఈ కిలాడీ లేడీని పట్టుకుని జైల్లోకి నెట్టారు.

Next Story

RELATED STORIES