గర్భం దాల్చిన కస్తూర్బా పాఠశాల టెన్త్ క్లాస్ విద్యార్థిని

X
TV5 Telugu31 Oct 2019 5:36 AM GMT
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక గర్భం దాల్చిన ఘటన కలకలం రేపుతోంది. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపారు. మా అమ్మాయికి అన్యాయం చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కస్తుర్బా స్కూల్‌లో ANMగా పనిచేసే రాధ భర్త మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భవతి చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుపుతున్నామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.
Next Story