తాజా వార్తలు

ఏనుగు ఆకారంలో పంది పిల్లలు

ఏనుగు ఆకారంలో పంది పిల్లలు
X

Elephant

మహబూబాబాద్‌ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఈ ఘటన గూడూరు మండలం నాయక్‌ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కొన్ని రోజులుగా పందుల గ్రూపు తిరుగుతోంది.. ఈ క్రమంలో ఓ పందికి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.అయితే ఆ రెండు పిల్లలు ఏనుగు లాగ తొండం ఆకారం కలిగి ప్రత్యేకంగా ఉన్నాయి. దాంతో ఈ వింత ఘటనను చూడటానికి గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. పిల్లలు తెల్లగా ఉండి, చూడ్డానికి ముద్దుగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలియుగంలో ఇలాంటి సంఘటనలు జరగడం మామూలే అని గ్రామంలోని వృద్ధులు అభిప్రాయపడుతుంటే.. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఇదొక వింతే అని చెప్పాలి.

Next Story

RELATED STORIES