అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఐసిస్

తమ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ నిర్ధారించింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు ఒక ఆడియో విడుదల చేసింది. దీంతో పాటు తమ సంస్థకు తదుపరి అధినేతగా, బాగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్ హషమి అల్ ఖురేషిని ప్రకటించింది. బాగ్దాదీ హతమైన కొన్ని గంటల్లోనే.. అతడి అనుచరుడు అబు హసన్ అల్ ముహజిర్ ను కూడా అమెరికా సైన్యం మట్టు బెట్టిందని తెలిపంది. ఈ ఇద్దరి చావుకి కారణమైన యూఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ఆడియోలో తెలిపింది.
ఆదివారం ఎన్‌డీఎఫ్ దళాల సాయంతో అమెరికా సైన్యం చేసిన సీక్రెట్ ఆపరేషన్ లో బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. సుమారు 2 గంటలు జరిగిన ఈ ఆపరేషన్ లో బాగ్దాదీతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారని అమెరికా ప్రకటించింది. ఈ ఆపరేషన్ వీడియోలు కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కూడా తమ అధినేత చనిపోయినట్లు ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com