మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ
X

miku-matrame-cheputha-revie

మూవీ : మీకు మాత్రమే చెప్తా

నటీనటులు : తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ తదితరులు

సంగీతం :శివ కుమార్

నిర్మాత : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ

దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్

మీకు మాత్రమే చెప్తా.. హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం. ఇదే కాకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా. ఈ రెండు పాయింట్స్ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో మీకుమాత్రమే చెప్తా టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఆసక్తిని పెంచింది. ప్రోమోస్, ట్రైలర్స్ తో కంప్లీట్ ఫన్ రైడ్ అనిపించుకున్న ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 1న) విడుదలైంది. మరి ఈ మూవీ మినీ రివ్యూ చూద్దాం..

ఓ టివి ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తుంటాడు రాకేశ్. అతను ప్రేమించిన స్టెఫ్ఫీ అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. ఆమె డాక్టర్. మతాలు వేరైనా తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పిస్తాడు. ఏం చేసినా తన ఫ్రెండ్ తోడుగా ఉంటాడు రాకేశ్ కు. పెళ్లి రేపు అనగా రాకేశ్ కు సంబంధించి మరో అమ్మాయితో ఉన్న ఓ వీడియో బయటకు వస్తుంది. యూ ట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఆ వీడియతో అతను భయపడతాడు. దీని వల్ల తన పెళ్లి ఆగిపోతుందేమోనని.. ఈ వీడియోను డిలీట్ చేయించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. మరి ఈ ప్రయత్నంలో రాకేశ్ అండ్ ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. వాటినుంచి ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలా పంచారు అనేది మిగతా కథ.

cinema

కథగా చెబితే ఇందులో పెద్ద స్టోరీ ఏం లేదు. ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం. ఆ కథనాన్ని వీలైనంత ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారు. కాంటెంపరరీ సబ్జెక్ట్ కూడా కావడంతో ముఖ్యంగా అర్బన్ యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అకవాశాలున్నాయి. అయితే ఇంత చిన్న పాయింట్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా కథనం మీద సామే. అంటే కథనం ఏ మాత్రం బెడిసికొట్టినా.. మొత్తానికే తేడా వస్తుంది. కానీ దర్శకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సిట్యుయేషన్స్ నుంచి కామెడీని ఎలివేట్ చేస్తూ కథనం నడిపించాడు. దీంతో సినిమా ఆసాంతం హీరో బాధపడుతున్నా ప్రేక్షకులు నవ్వుకుంటుంటారు. దర్శకుడి టార్గెట్ కూడా ఇదే.

ఇప్పుడు ఎవరు చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దాంతో ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. ఇబ్బంది కలిగించే ఫీచర్సూ ఉన్నాయి. ఎంచుకునే దాన్ని బట్టే ఆ వ్యక్తి క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. అలా అనుకోకుండా ఓ షూటింగ్ కోసం అందులో నటించిన హీరోయిన్ చేసిన పనికి.. హీరో ఇరుక్కుంటాడు. అప్పటికే అతని పెళ్లిని చెడగొట్టాలని ఓ వారియర్ తిరుగుతుంటాడు. తనకు క్వాలిఫికేషన్ పెద్దగా లేకపోయినా.. అబద్ధాలు, మందు, సిగరెట్ వంటివి అస్సలు నచ్చని హీరోయిన్ ఇక ఆ వీడియో చూస్తే ఇంకేమన్నా ఉందా.. ? హీరోలో ఉండే ఈ భయం, కన్ఫ్యూజన్ నుంచి కావాల్సినంత కామెడీని క్రియేట్ చేశాడు దర్శకుడు. కొన్నిసార్లు కొన్ని సీన్స్ రిపీటెడ్ అనిపించినా.. ఆ వీడియో డిలీట్ చేయడానికి వాళ్లు పడే కష్టం అంతా కడుపుబ్బా నవ్విస్తుంది.

mmc

దర్శకుడు హీరో అయితే .. అనే ప్రశ్నకు తన అద్భుత నటనతో ఆశ్చర్యపరిచి సమాధానం ఇచ్చాడు తరుణ్ భాస్కర్. అతని ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీ అని చెప్పాలి. అతనికి ఫ్రెండ్ గా నటించిన అభినవ్ టైమింగ్ లో వేసే పంచులకు కామెడీ మరింత పేలింది. అనసూయ పాత్ర ఆఖర్లో సర్ ప్రైజ్ చేస్తుంది. అలాగే వారియర్ గా నటించిన కుర్రాడు కూడా ఆకట్టుకున్నాడు. పావని, హీరోయిన్ తో పాటు వీడియోలో హీరోయిన్ పాత్రలో నటించిన అమ్మాయి.. అంతా ఆకట్టుకునే నటన చూపించారు. చాలామంది ఆర్టిస్టులను కొత్తగా పరిచయం చేశాడు.

టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉందీ చిత్రం. సెకండ్ హాఫ్ లో కొంత ఎడిట్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో. కొన్ని సీన్స్ అవసరం లేదనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో పెట్టిన ట్విస్ట్. ఇది పూర్తిగా అనవసరం అనిపిస్తుంది. ఇక చివర్లో విజయ్ దేవరకొండ పాట మీనింగ్ ఫుల్ గా సాగుతుంది. మొత్తంగా దర్శకుడు ఇంకాస్త హోమ్ వర్క్ చేసి ఉంటే బావుండు అనిపిస్తుంది. బట్ డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి.

విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా అభిరుచిని చూపించాడు. కొత్త దర్శకుడుని పూర్తిగా నమ్మాడు. అతను సినిమాలో ఎక్కడా కలగజేసుకున్నట్టు కనిపించలేదు. పూర్తిగా దర్శకుడికే స్వేచ్ఛను ఇచ్చాడు. ఇదీ మెచ్చుకోవాల్సిన అంశమే. మొత్తంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చారు కాబట్టి ఆ మేరకు సూపర్ సక్సెస్ అవుతారు అని చెప్పొచ్చు.

- బాబురావు.కే

Next Story

RELATED STORIES