భర్తతో గొడవ పడిన భార్య.. పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి..

భర్తతో గొడవ పడిన భార్య.. పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి..
X

crime

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం జరిగింది. కన్న తల్లే పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి హతమార్చిన ఘటన విషాదంగా మారింది. గత నెల 26న హఫీజ్‌ బాబా నగర్‌లో ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనిపై కంచన్‌ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోస్టు మార్టం రిపోర్ట్‌ ఆధారాలతో తల్లి ఫరహాత్‌ బేగంను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. తానే పిల్లలను చంపానని ఒప్పుకుంది. పిల్లల హత్యకు భార్య భర్తల మధ్య గొడవే కారణమని పోలీసులు చెబుతున్నారు. భర్తతో గొడవ పడి డిప్రెషన్‌లోకి వెళ్లిన భార్య.. తాను చనిపోతే తన పిల్లలను ఎవరు చూసుకుంటారన్న కారణంతోనే పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES