మొదటి ప్రియుడు బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా.. - కీర్తి

మొదటి ప్రియుడు బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటా.. - కీర్తి
X

keerthi

తల్లిని చంపి కటకటాలపాలైన కీర్తి.. తనను గర్భవతిని చేసిన మొదటి ప్రియుడు బాల్‌రెడ్డినే చేసుకుంటానని చెబుతోంది. తనకు అతడే కావాలంటోంది. జైలుపాలైన ఆమె ప్రవర్తన, మాటతీరును గమనిస్తున్న పోలీసులు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో తల్లి రజితను హత్య చేసిన కీర్తి.. తన 16 ఏళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాల్‌రెడ్డికి దగ్గరైంది. ఏ విషయమైనా అతనితోనే పంచుకునేది. తల్లి లేనప్పుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లేది. గత ఏడాది సెప్టెంబరులో గర్భం దాల్చినట్టు అనుమానం వచ్చిన కీర్తి.. ప్రెగ్నెన్సీ కిట్‌తో పరీక్షించుకోగా గర్భం నిర్ధారణ అయ్యింది.

అయితే కీర్తి గర్భం దాల్చిందని తెలిసి బాల్‌రెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. అబార్షన్ కోసం కొన్ని ఆసుపత్రులకు ఫోన్ చేశాడు. రెండు రోజుల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు చెప్పడంతో శశికుమార్‌ సాయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమనగల్‌లో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి కీర్తికి అబార్షన్‌ చేయించాడు బాల్‌రెడ్డి. ఇద్దరు అక్కడే రెండు రోజుల పాటు ఉన్నారు. మొదటి ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన కీర్తి రెడ్డి.. అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని పెద్ద తప్పు చేసింది. అదే అతడికి అస్త్రంగా మారి చివరకు కీర్తి రెడ్డిని ఉసిగొల్పి.. తల్లి హత్యకు ప్రేరేపించినట్లైంది.

అయితే ఈ కేసు ఇప్పుడు ఆమన్‌గల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తి రెడ్డికి అక్కడ అబార్షన్‌ ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగ లాగుతున్నారు పోలీసులు. ఆమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌లో ఆమెకు అబార్షన్‌ చేసినట్లు నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు.. ఆస్పత్రిని సీజ్‌ చేశారు. నిబంధనలు అతిక్రమించి అబార్షన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రజిత హత్యతో నేర కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Next Story

RELATED STORIES