తాజా వార్తలు

తెలంగాణలో మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా!

తెలంగాణలో మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా!
X

telangana

తెలంగాణలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. పోలింగ్‌ నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం సమాయత్తమైంది. తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారిగా అధికారులతో సమావేశమైన ఎలక్షన్‌ అధికారులు ఈ నెల 4న నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదట కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, తర్వాతి దశలో మిగతావాటికి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్‌, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే మున్సిపల్‌ శాఖ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను తీయనుంది.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే సుదీర్ఘంగా కోర్టుల్లో ఉన్న కేసులు, వాదనల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. అయితే ప్రభుత్వం..రాష్ట్ర ఎన్నికల సంఘం తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు 50 మున్సిపాల్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 78 మున్సిపాల్టీల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుంది. దీంతో..ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టీలకు కలిసి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అన్నింటికి కలిపి ఈ నెల 4న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక అధికారులు ఆయా వార్డుల రిజర్వేషన్ల డ్రా నిర్వహించనున్నారు.

Next Story

RELATED STORIES