జనసేన లాంగ్‌ మార్చ్‌ అప్ డేట్స్..

జనసేన లాంగ్‌ మార్చ్‌ అప్ డేట్స్..
X

janasena-long-march

రాష్ట్రంలో కార్మికులను కన్నీరు పెట్టిస్తున్న ఇసుక సమస్యపై పోరుబాటకు జనసేన సిద్ధమైంది. ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా ఆదివారం విశాఖలో లాంగ్‌ మార్చ్‌ను నిర్వహించనుంది. ఇసుకను వెంటనే అందుబాటులోకి తేవాలని.. ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికంగా సాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన కార్యక్రమం చేపడుతోంది జనసేన. మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో ప్రారంభం కానున్న లాంగ్‌ మార్చ్‌... రామాటాకీస్‌, ఆశిల్‌ మెట్ట జంక్షన్‌ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ తీయనున్నారు.

Next Story

RELATED STORIES