తాజా వార్తలు

కన్న తల్లిని అతి దారుణంగా కొట్టి చంపిన కుమారుడు

కన్న తల్లిని అతి దారుణంగా కొట్టి చంపిన కుమారుడు
X

student

కుటుంబ కలహాల కారణంగా... తల్లిని అతి దారుణంగా కొట్టి చంపాడో కుమారుడు. కామారెడ్డిజిల్లా చిట్యాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సాయవ్వకు అక్రమ సంబంధాలున్నాయని... కొడుకు మహేష్ అనుమానం. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే గతంలో మహేష్ ను చంపించాలని చూసింది సాయవ్వ. ఈ కేసులోనే సాయవ్వతో పాటు మరో నలుగురు జైలుకు వెళ్లి ఇటీవలే విడుదల అయ్యారు.

జైలు నుంచి బయటకు వచ్చిన సాయవ్వ మళ్లీ తనను చంపిస్తుందని భావించాడు కొడుకు మహేష్. ఈ భయంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్రతో దారుణంగా కొట్టిచంపి పరారయ్యాడు. ఈ ఘటనతో చిట్యాల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Next Story

RELATED STORIES