శ్రీముఖి ఓటమికి కారణం ఇదే!

శ్రీముఖి ఓటమికి కారణం ఇదే!
X

bigg-boss-3

రియాలిటీ షోలన్నింటిలోనూ ‘బిగ్ బాస్’ షో ప్రత్యేకం. ‘బిగ్ బాస్’ స్టార్ట్ అయింది అంటే ఆ షో కు ఉండే క్రేజే వేరు. ఇక టైటిల్ విషయంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే టాలీవుడ్‌లో రెండు సీజన్లు ముగిశాయి. తాజాగా మూడో సీజన్‌కు కూడా శుభం కార్డు పడింది. 100 రోజులకు పైగా అభిమానులను అలరించిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి మధ్య చివరి నిమిషం వరకు హోరా హోరి పోటీ నెలకొంది. అసలు శ్రీముఖినే విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. కానీ, చివరికి వచ్చే సరికి రాహుల్ విజేతగా నిలిచాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3‌కు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ విజేతగా అవతరించాడు. శ్రీముఖికి రన్నరప్ టైటిల్ దక్కింది. బాబా భాస్కర్ మూడోస్థానంలో, వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో, అలీ చివరి స్థానంలో చోటు సంపాదించుకున్నారు. విజేతగా అవతరించిన రాహుల్ సిప్లిగంజ్‌కు టైటిల్‌తో పాటు రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందించారు నాగార్జున.

అయితే రాహుల్‌కి సపోర్ట్ చేసిన ఆడియన్స్ సంబరాల్లో మునిగితేలుతుంటే.. అతన్ని హేట్ చేసే వారు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఒకరిపై ఆధారపడి గేమ్ ఆడిన రాహుల్‌ను విజేతగా ప్రకటించడాన్ని పలువురు బిగ్ బాస్ అభిమానులు విమర్శిస్తున్నారు. శ్రీముఖి ఫ్యాన్స్ అయితే రాహుల్‌ విన్నర్ అవ్వటం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీముఖి విన్నర్ కాకపోవటానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో కొందరూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. గేమ్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి టాస్కుల పరంగా చూసుకుంటే.. రాహుల్ కన్నా శ్రీముఖినే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. అయితే కొంత మందికి బిగ్ బాస్ హౌజ్ లో శ్రీముఖి చేసిన పనులు ఓవర్ యాక్షన్‌గా అనిపించాయని అంటున్నారు. ఆమె ఓవర్ యాక్షన్ తో డామినేషన్ చేసేది అని రాహుల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ హంగామానే శ్రీముఖిని విన్నర్ టైటిల్ కి దూరం చేసి ఉండవచ్చని విమర్శకులు విశ్లేషిస్తున్నారు.

హౌజ్‌లో శ్రీముఖి మొదటి నుంచి రాహుల్‌కు యాంటీగానే ఉంటూ వస్తుంది. రాహుల్‌ని శ్రీముఖి చాలాసార్లు నామినేట్ చేసింది. రాహుల్ కూడా శ్రీముఖిని అవకాశం దొరికిన ప్రతిసారి నామినేట్ చేస్తూ వచ్చాడు. అయితే ఇంటిలో మిగిలిన సభ్యులతో ఉన్నంత క్లోజ్‌గా రాహుల్‌తో శ్రీముఖి మొదటి నుంచి లేదని బిగ్ బాస్ అభిమానుల్లో అనుమానం ఉండేది.

అలీ ఎలిమినేట్ అయినప్పుడు శివజ్యోతితో కలిసి శ్రీముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక శ్రీముఖి టాస్క్ ల దగ్గర నుంచి రాహుల్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ఓవర్ యాక్షనే.. ఆమెకు పెద్ద మైనస్ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు. శ్రీముఖి టీం సోషల్ మీడియాలో చేసిన హంగామా కూడా ఓ రకంగా ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అని విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి ఒక మంచి కంటెస్టెంట్.. టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్.. తాను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల టైటిల్‌ను చేజార్చుకోవాల్సి వచ్చిందనేది టాక్. అలాగే, బయట కొందరు కంటెస్టెంట్ ల ప్రభావం కూడా ఆమెకు వచ్చే ఓట్లను ఆపేశాయి అని నెటిజన్ల అభిప్రాయం. ఇవన్నీ కూడా రాహుల్‌కి కలిసొచ్చాయి అని ప్రచారం. షో ప్రారంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రాహుల్ చివరికి 'బిగ్ బాస్ 3’ విన్నర్‌గా నిలిచాడు.

Next Story

RELATED STORIES