అబ్దుల్లాపూర్‌మెట్ తొలి ఎమ్మార్వో‌గా విజయారెడ్డి..

అబ్దుల్లాపూర్‌మెట్ తొలి ఎమ్మార్వో‌గా విజయారెడ్డి..

mro-vijaya

మాటలకందని విషాదం. తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరుగని దారుణం. ఓ తహసీల్దార్‌.. పట్టపగలే తన ఆఫీసులో హత్యకు గురయ్యారు. దుండగుడి పైశాచికత్వానికి ఆ MRO, చమురు మంటల్లో కాలి బూడిదయ్యారు. విధి నిర్వహ ణలోనే ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది.

హైదరాబాద్‌ శివారులో పట్టపగలే దారుణం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో తహసీల్దార్‌గా పని చేస్తున్న విజయారెడ్డిని సజీవదహనం చేశాడో దుండగుడు. MRO ఆఫీసుకు వచ్చిన దుండగు డు, విజయారెడ్డితో మాట్లాడు తూనే ఒక్కసారిగా దాడి చేశాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో బిత్తరపోయిన విజయారెడ్డి ప్రాణభయంతో కేకలు వేసింది. ఆ అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్ గుర్నాథం, తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆలోపే, దుండగుడు విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో చిక్కుకొని ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెను కాపాడడానికి డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.

mro-suresh

విజయారెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని గౌరెళ్లి గ్రామానికి చెందిన కూర సురేష్‌గా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల సమయంలో MRO ఆఫీస్‌కు వచ్చాడూ సురేష్. రావడంతోనే నేరుగా MRO గదిలోకి వెళ్లి తలుపులు వేశాడు. విజయారెడ్డితో మాట్లాడుతూనే దాడికి దిగాడు. ఆమె కేకలు వేస్తుండగానే పెట్రోలు పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో సురేష్‌కు కూడా గాయలయ్యాయి. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనల గాయపడడంతో సురేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

విజయారెడ్డి హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహసీల్దార్ విజయకు, సురేష్‌కు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఏడెకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తహసీల్దార్ తమను వేధిస్తున్నారని నిందితుడు సురేష్, పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

mro-family

తహసీల్దార్ విజయారెడ్డి నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి లింగారెడ్డి విశ్రాంత ఉపాధ్యా యుడు. మునుగోడు మండలం కల్వేలపల్లికి చెందిన డిగ్రీ లెక్చరర్‌ సుభాష్ రెడ్డితో వివాహం జరిగింది. 2009లో గ్రూప్‌-2 పరీక్షల్లో విజయారెడ్డికి ఉద్యోగం వచ్చింది. తహసీల్దార్‌గా ఆమె ఎంపికయ్యారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగా ఏర్పడడంతో ఆమెకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తొలి MROగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story