ఎమ్మార్వో విజయారెడ్డిని సజీవదహనం చేసిన రైతు..

హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. MROను పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడో రైతు. మధ్యాహ్నం 1:30 నిమిషాల సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని MRO ఆఫీస్‌కు వచ్చాడు సురేష్ అనే రైతు. రావడంతోనే నేరుగా MRO గదిలోకి వెళ్లి తలుపులు వేశాడు. MRO విజయారెడ్డితో మాట్లాడుతూనే.. ఒక్కసారిగా దాడికి దిగాడు.
భూ రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడంతో MRO విజయారెడ్డిపై కోపం పెంచుకున్నాడు నిందితుడు సురేష్. ఆ కోపంతోనే దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు నేరుగా MRO ఆఫీసులోకి ఎలా వెళ్లాడు.? పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దాన్ని సిబ్బంది ఎందుకు గమనించలేదు..? సురేష్ ఒక్కడే వచ్చాడా? అతనితోపాటు ఇంకా
ఎవరైనా ఉన్నారా అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘనట తర్వాత నిందితుడు సురేష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com