న్యాయం కోసం పోలీసుల నిరసన..

తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో లాయర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ నేపథ్యంలో.. ఢిల్లీ నగర కోర్టుల పరిధిలో ఉద్రిక్తతలు పెరిగాయి. మంగళవారం ఐటీఓలో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. ఈనెల 2న జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
తీస్ హజారీ కోర్టు దాడి ఘటన నేపథ్యంలో న్యాయవాదులు సోమవారం కూడా ఓ పోలీసుపై దాడి జరిగింది. సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ బయట తన మోటారు సైకిల్ వద్ద నిలబడి ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను ఆరుగురు న్యాయవాదుల బృందం చుట్టుముట్టింది. ఒక లాయర్.. ఆ కానిస్టేబుల్ మీదకు దూసుకెళ్లి అతడి మోచేతిని పట్టుకుని రెండుసార్లు వెనుకకు తిప్పి, రెండుసార్లు చెంప దెబ్బలు కొట్టి నెట్టివేశాడు. దీంతో.. పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com