ఆమెకి ఇష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్ తల్లి

ఆమెకి ఇష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్ తల్లి
X

rahul.png

బ్యాచిలర్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే ఏదో అవుతుంది. మరి 100 రోజులు ఒకే ఇంట్లో ఉంటే అవ్వక ఎలా ఉంటుంది. కలతలు, కవ్వింపులు సర్వసాధారణం. కెమెరా కన్ను ఆ ఇద్దరి మీదే పడిందంటే.. సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్.. బయటకు వచ్చి అలాంటిదేమీ లేదని చెప్పిన సందర్భాలు, కేసులు చాలానే ఉంటాయి. కానీ బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అమ్మానాన్న మాత్రం బుద్దిగా.. మా అబ్బాయికి, ఆ అమ్మాయికి ఓకే అయితే పెళ్లి చేస్తాం అంటున్నారు.

ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఏమా కథ అంటే.. హౌస్ సభ్యులంతా పున్నూ అని ముద్దుగా పిలుచుకుంటే.. రాహుల్ మాత్రం నవీ అంటూ ప్రేమగా పిలిచేవాడు. రాహుల్ పిలుపుకి పునర్నవి పులకించిపోయేది. వారి మధ్య సాగిన స్వీట్ థింగ్స్ అన్నీ ప్రేక్షకులకు చెప్పకనే చెప్పాడు బిగ్‌బాస్. అప్పుడప్పుడు పున్నూ రాహుల్‌ని చెడామడా తిట్టినా.. ఆమె ఎలిమినేట్ అవడం ఇష్టం లేని రాహుల్ ఆమెకోసం 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగేసాడు. అదే కదా ప్రేమంటే అని అనుకున్నారంతా.

మరొకసారి రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అయినప్పుడు పున్నూ బాధపడినంతగా ఇంట్లో ఎవరూ బాధపడలేదు. మొత్తానికి రాహుల్ బిగ్‌బాస్ విన్నర్ అవ్వాలని పునర్నవి బలంగా కోరుకుందేమో.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సీజన్ 3 విన్నరయ్యాడు రాహుల్. అయితే హౌస్‌లో పున్నూ, రాహుల్ మధ్య సాగిన బంధాన్ని కొనసాగించడానికి అతడి అమ్మానాన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమెకి ఓకే అయితే అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. మరి నవీ ఓకే చేస్తే ఆమె మెడలో మూడు ముళ్లూ వేయడానికి రాహుల్ రెడీగా ఉన్నాడు.

Next Story

RELATED STORIES