నా భర్తను నేనే చంపేశా..

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతుల జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంటుంది. భర్తను ఎవరో హత్య చేస్తారు. కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కవుతారు. నా భర్తను నేనే చంపేశాను అని అనడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాదు ఒక్క క్షణం పాటు. సత్యదేవ్, ఇషారెబ్బ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'రాగల 24 గంటల్లో' చిత్రంలోని సన్నివేశం ఇది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ నవహాస్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. సత్యదేవ్, ఇషా రెబ్బల పెళ్లి సన్నివేశంతో ట్రైలర్ ఆరంభమవుతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com