రష్మీ ఏంటి సడెన్‌గా ఇలాంటి నిర్ణయం..

రష్మీ ఏంటి సడెన్‌గా ఇలాంటి నిర్ణయం..
X

rashmi

బుల్లితెర అందాల తార రష్మీ గౌతమ్ పాపులర్ షోకి యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. ఇక ఢీ అనే డ్యాన్స్ షోలో అయితే పార్టిసిపెంట్స్ చేసే డ్యాన్సులకంటే రష్మీ, సుధీర్, ప్రదీప్ చేసే కామెడీకే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా బుల్లితెర రష్మీ జీవితాన్ని మార్చేసింది. అడపాదడపా సినిమాల్లో కనిపించి అందాలు ఆరబోస్తున్నా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. దీంతో విసుగొచ్చేసింది అమ్మడికి. అందుకే స్ట్రాంగ్‌గా ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. తనకి లైఫ్‌ని ఇచ్చి పాపులర్ చేసిన బుల్లి తెరనే నమ్ముకుంటానంటోంది. ఇకపై ఏ సినిమా పడితే ఆ సినిమా చేయనని కథ నచ్చి తన పాత్ర ప్రాముఖ్యతను బట్టే సినిమాల్లో నటిస్తానని అంటోంది.

సినిమాల విషయం పక్కన పెడితే.. టీవీ షోస్‌తో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి రష్మీ రెడీ అయిపోతోంది. పెద్ద పెద్ద స్టార్సే ఇందులో నటించగా లేంది తాను నటిస్తే తప్పేముందని రష్మీ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా సినిమాలకన్నా సెన్సార్ ఉంటుందేమో కానీ వెబ్ సిరీస్‌కి అలాంటి కటింగులు ఏవీ వుండవు. ఇష్టం వచ్చినట్లు నటించవచ్చని ఈ నిర్ణయం తీసుకుంది. అన్నిటికీ మించి పారితోషికం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఫిలిం బై అరవింద్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ సూరి డైరక్షన్లో రష్మీ వెబ్ సిరీస్ చేయాలని చూస్తోంది. నటి కాజల్ కూడా వెబ్‌ సిరీస్ వైపు అడుగులు వేస్తోంది.

Next Story

RELATED STORIES